పురపాలక సంఘాల్లో చెత్తను తరలించేందుకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ ఆటోలు పలుచోట్ల మూలకు చేరాయి. దీంతో వీధుల్లో ట్రాక్టర్ల ద్వారానే చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి, పొడి చెత్త సేకరణ కానరావడం లేదు. ప్రభుత్వ క్లాప్ కార్యక్రమం అంతా ప్లాప్‌గా మారింది.
జిల్లాలోని పురపాలక సంఘా ల్లో స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పర్యావరణానికి విఘాతం లేకుండా ఉండేందుకు గతేడాది జూన్‌లో ఈ-ఆటోలను రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసింది. తిరుపతి జిల్లాలో నాయుడుపేట, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు, పలమనేరు పురపాలక సంఘాలకు 8 చొప్పున మొత్తం 16 ఈ-ఆటోలను అందించారు. ఆటోలు పురపాలక సంఘాలకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు వివిధ కారణాలతో వినియోగంలోకి తీసుకురాలేదు. తరువాత రిజిస్ట్రేషన్, బీమా చేయించి పురపాలికల్లో పనిచేసే పలువురికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి, ఎట్టకేలకు వినియోగం
ఒక ఈ-ఆటో ఖరీదు రూ.4.10 లక్షలు. ఈ మొత్తాన్ని పురపాలక సంఘాలే భరించాలి. నెలనెలా ఈఎంఐ రూపంలో రూ.10 వేలు చొప్పున చెల్లించాలి. అధికారులు ఒక్కొక్క వాహనంలో అర టన్ను చెత్తను తరలించవచ్చని చెప్పగా.. క్షేత్రస్థాయిలో అంత మొత్తంలో తరలించలేని పరిస్థితి. వాహనాలకు సరిగా ఛార్జింగ్ కాక, తరచూ మరమ్మతులకు గురై మార్గమధ్యలో ఆగిపోతున్నాయి. కొన్నిచోట్ల నేటికీ డ్రైవర్లు లేక వినియోగించడం లేదు. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. వాటిని అమరావతి నుంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మెకానిక్‌లు వచ్చి మరమ్మతులు చేయాల్సి ఉండగా వారు రావడం లేదు. అధికారులు పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లిన వారు స్పందించడం లేదు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
పురపాల్కిలకు మంజూరైన ఈ-ఆటోలు చాలావరకు మరమ్మతుకు గురైన విషయాన్ని రాష్ట్ర స్వచ్ఛాంద్రప్రదేశ్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సిబ్బంది వచ్చి మరమ్మతులు చేయగానే వినియోగంలోకి తీసుకువస్తాం.
గంగాప్రసాద్, పురకమిషనర్, సూళ్లూరుపేట
source : eenadu.net
Discussion about this post