జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో రూ.23.25 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే, రోగులకు నాణ్యమైన అత్యవసర వైద్యం అందుతుందని జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు పేర్కొన్నారు. 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ప్రధాని మోదీ గుజరాత్‌లోని రాజ్‌కోట నుంచి వర్చువల్‌గా ఆదివారం శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచే తన సందేశాన్ని వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తోపాటు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు, బ్రెయిన్ స్టోక్ర్ వచ్చిన రోగులకు, అత్యవసరమైన వారికి వెంటిలేటర్‌పై వైద్యం అందించవచ్చని పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post