పాండవ సేన బాబుది అని.. జగన్‌ది కౌరవ సేన అని.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్, నగర పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌తో కలిసి సోమవారం మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కౌరవ సేన నేత జగన్‌కు ఓటమి తప్పదన్నారు. చంద్రబాబుని గత ఎన్నికల్లో ఓడించి తప్పు చేశామని, దానిని సరిదిద్దుకునే సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తెదేపా-జనసేన పార్టీలకు పట్టం కట్టాలని సోమిశెట్టి పిలుపునిచ్చారు. ;బీసీ సెల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి.హనుమంతరావు చౌదరి, ప్రొఫెషనల్ విభాగం కన్వీనర్ పి.భరత్ పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post