హిందూపురం : ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌పరశురాం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేబాలకృష్ణ ఆధ్వర్యంలో చేరుకున్న విషయం పాఠకులకు విధితమే. అయితేఆ పార్టీలో తనకు సరైన స్థానం లభించలేదని మళ్లీ తన సొంత గూడైనవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీపిక, చల్లాపల్లి బాబురెడ్డి ఆధ్వర్యంలోచేరుతున్నట్లు పరశురాం ప్రకటించారు. ఈ సందర్భంగా సార్వత్రికఎన్నికలలో దీపికను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రకటన చేశారు.స్థానికవైఎస్‌ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద గురువారం విలేకరుల సమావేశంఏర్పాటు చేసి వైయస్సార్సీపి హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిటి.యన్ దీపిక , చల్లాపల్లి బాబురెడ్డి ఆద్వర్యంలో 20 వ వార్డు కౌన్సిలర్‌పరుశరాం కండువా కప్పించుకొన్నారు. ఈ సందర్భంగా దీపికమాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు చేసినప్పటికీఆఖరి విజయం తమదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ పథకాలు తమ విజయానికి నాందిపలుకుతాయన్నారు. 40 యేళ్లలో పురం అభివృద్ధి చెందక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఈసారి ఎన్నికలలో తాను విజయం సాధించి హిందూపురంనియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోశివ, నాగరాజు, సుభాష్ గాంధీ, రామ్మూర్తి తదితరులు ఉన్నారు.
source: anantha bhoomi
Discussion about this post