ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన అధికారులుఅధికార పార్టీ నేతలవైపు కన్నెత్తి చూడని వైనం.
ప్రజాశక్తి-హిందూపురం:
హిందూపురం పట్టణ సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో అధికార పార్టీ నేతలకనుసన్నుల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు. ఇసుక అక్రమరవాణాపై ప్రజాశక్తి దినపత్రిక రెండు రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు.అయితే అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు బుధవారం కోటిపి రోడ్డు రైల్వే గేటు వద్ద ఒక ఇసుక ట్రాక్టర్‌నుస్వాధీనం చేసుకొని, డ్రైవర్ గంగాధరప్ప అలియాస్ గంగప్పపై కేసు నమోదు చేసి రూరల్ స్టేషన్‌కు అప్పగించిచేతులు దులుపుకున్నారు. అయితే ఈ విషయంపై సబ్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తమ వద్దపూర్తి స్థాయిలో సిబ్బంది లేరని అన్నారు. ఉన్న సిబ్బందితో ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నామన్నారు.
అధికార పార్టీ నేతల జోలికి వెళ్లని అధికారులు:
పట్టణ సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో హిందూపురం మండలం జెడ్ పిటిసిసోదరుని కుమారుడు, అధికార పార్టీ ముఖ్య నేత సోదరుడు కలిసి పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఇసుకఅక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకొని అధికారులు అవసరం కోసం అమాయకులుతీసుకు వెళుతున్న ట్రాక్టర్ ను పట్టుకొని కేసును నమోదు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పెన్నానది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, జిల్లా సెబ్ అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని నది పరివాహక గ్రామ రైతులు కోరుతున్నారు.
Discussion about this post