కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లికీ మోసే పవన్‌ను ఏమనాలి అని ప్రశ్నించారు. అలాగే, శత్రువులతో షర్మిల చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పేర్నినాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్షానే ఉన్నారు. ప్రజలే కృష్ణుడిలా సీఎం జగన్‌ను ముందుకు నడిపిస్తారు. సీఎం జగన్ ఫొటో పెట్టుకుని బాలశౌరి ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు సిగ్గేలేకుండా విమర్శలు చేస్తున్నాడు. షర్మిల తన కుటుంబ శత్రువులతో చేతులు కలిపారు. ఇది సీఎం జగన్ అనుచరులు చూస్తూ ఊరుకుంటారా?. నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోండి.
జంపింగ్ జపాంగ్‌ల వీరుడిగా పవన్ కల్యాణ్ మారిపోయాడు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. చిరంజీవి జనరంజక నటుడు. చిరంజీవి కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారు. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్‌ను ఏమనాలి. రాబోయే ఎన్నికల్లో పవన్‌ది శల్యుడి పాత్ర. పవన్‌ను సీఎంగా చూడాలన్న జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. చంద్రబాబు రిజెక్ట్ చేసిన బాలశౌరిని పవన్ పక్కకు పంపించింది బాబే. పదవుల కోసం నేతలు గడ్డికరుస్తున్నారు. నాదేండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలోకి దూరిపోయారు. ఆశ్రయం, అధికారం, అర్హత కల్పించిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదు.
శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా సీఎం జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరు. కాపు కులాన్ని ఫణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేఖ రాశారు. హుందాగా వ్యవహరించాలని పవన్‌కి సూచించారు. కమ్మలు, రెడ్లలాగే అధికారం కోసం పోరాడమని లేఖలో కోరారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం జగన్‌పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబుకి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. నన్ను ఓ సర్వర్‌లా చంద్రబాబు అభివర్ణించారు. పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా?’ అని సీరియస్ అయ్యారు.
source : sakshi.com
Discussion about this post