ధర్మవరం నియోజకవర్గం లోని అన్ని మండలాల కార్యకర్తలతో గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బిజెపి నుండి టికెట్ ఆశించిన వరదాపురం సూరి గారికి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తల అభిప్రాయం సేకరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హై కమాండ్ కి తమ ఆలోచనలు,ప్రస్తుతం ధర్మవరంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు అన్ని తెలిపే విధంగా చర్యలు తీసుకున్నారని త్వరలో వారు మనకి పాజిటివ్ స్పందన ఇస్తే సంతోషం ,లేకుంటే ప్రజల అభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని వరదాపురం సూరి గారు తెలిపారు.
Discussion about this post