జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయంలో AD నాగరాజు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలు తొలగించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే తల్లితండ్రులకు మాయమాటలు చెప్పి ముందస్తుగా అడ్మిషన్లకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా ప్రధాన కూడలిలో సీబీఎస్సీ పేరుతో పర్మిషన్లు లేకపోయినా కూడా పెద్దపెద్ద హోల్డింగ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను కార్పొరేట్ విద్యాసంస్థలు ఏమాత్రం పాటించకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని స్కూళ్లకు పర్మిషన్లు తెచ్చుకొని ఐదు నుంచి పది బ్రాంచ్ లు నడుపుతున్నారని తెలిపారు. తక్షణమే అనుమతులు లేకుండా నడుపుతున్న బ్రాంచ్లను సీస్ చేయాలని డిమాండ్ చేశారు. కూడలిలో భారీ హోల్డింగ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 2024 25 విద్యా సంవత్సరం సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించామని ఫ్లెక్సీలలో బహిరంగంగా ఏర్పాటుచేసిన వారు పె చర్యలు తీసుకోవాలని. ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్న విద్యాసంస్థల పైన తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బాబావలి నాగార్జున బాబ్జాన్ వీరేష్ హర్ష కుమార్ భగత్ హరీష్ పాల్గొన్నారు.
Discussion about this post