ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఇందిరా నగర్, పి ఆర్ టి, గాంధీ నగర్, ఎస్సీ కాలనీ, మాధవ్ నగర్, శివానగర్, కేశవ్ నగర్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి బాటలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, జేవి రమణ, వెంకటస్వామి, రవికుమార్ వెంకటనారాయణ, సిపిఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఎస్హెచ్ భాష, మారుతి, నాగార్జున, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహీర్, నారాయణస్వామి, మునఫ్, జాఫర్, కరీం, సాయి, శంకర్, రాజు, మన్సూర్ , సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కదిరి టౌన్ : ఇండియా వేదికతోనే అభివృద్ధి సాధ్యమని వామపక్షపార్టీల నాయకులు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షాన్వాజ్కు మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు శుక్రవారం కదిరి పట్టణంలోని 27,28,33 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ మేరకు ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
source: prajasakthi.com
Discussion about this post