జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి బీజేపీ నేతలతో తిట్లు తిన్న పవన్ కల్యాణ్‌కు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్ధుల నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తన సొంత నియోజక వర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టీడీపీ నేతను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించడం పై ట్రోలింగ్ జరుగుతోంది.
పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిరుగుతున్నారు. ఎలాగో ఒకలా ఈ ఎన్నికల్లో అయినా తనని ఎమ్మెల్యేని చేయమని అడుగుతున్నారు. ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టింది లగాయితు పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ అభ్యర్ధులు పోటీ చేస్తోన్న మిగతా 20 నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేయాలి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ అభ్యర్ధుల నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేసి పెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఒక వైపే చూస్తున్నారు. రెండో వైపు చూడ్డానికి భయపడుతున్నారు.
source : sakshi.com
Discussion about this post