ఢిల్లీ: ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది..ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే..ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు..ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు..ఈసీ కమిషనర్లు కూడా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. వెంటనే షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Discussion about this post