రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని టీడీపీ నేతలకు ఇప్పటికే అర్థమైంది. మరోవైపు.. సర్వేలన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగనే మరోసారి సీఎం అవుతారనే తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పచ్చ బ్యాచ్‌కు టెన్షన్ మొదలైంది. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చాడు. అయినప్పటికీ ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే ఓటర్లను నోట్ల కట్టలతో మభ్యపెట్టేందుకు పచ్చ బ్యాచ్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఇందు కోసం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని రంగంలోకి దింపింది. వీరంతా పల్లెల్లో ఓట్ల కొనుగోలుకు సిద్ధమై ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఆఫీసులో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో-ఆర్డినేటర్ కోమటి జయరాం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఓటర్లకు డబ్బులు ఎలా పంచాలో సూచనలు చేశారు. ఇక, దానికి సంబంధించిన వీడియా బయటకు వచ్చింది.
ఈ సందర్భంగా కోమటి జయరాం అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారుల ఫ్యామిలీలకు మూడు, నాలుగు లక్షలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం వెయ్యి వైఎస్సార్‌సీపీ కుటుంబాలను కొనడానికి స్కెచ్ వేశారు. ఇదే సమయంలో సీఎం జగన్‌ను అభిమానించే కుటుంబాలను వెదవలు అంటూ నోరు పారేసుకున్నారు. ఓటుకు ఎంతైనా ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని సూచించారు.
అయితే, ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. జయరాం వంటి వ్యక్తులు విదేశాల నుంచి ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. మన కష్టాలు వారికేం తెలుసు?. డబ్బు ఉందన్న మదంతో ఓటర్లను కించపరిచే విధంగా మాట్లాడటం మాత్రమే వారికి తెలుసు. చంద్రబాబు లాంటి వ్యక్తిని రాజకీయంగా సమాధి చేస్తేనే.. కోమటి జయరాం లాంటి నీచులకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది. మనతో శాశ్వతంగా ఉండేది.. మన కష్టాలు వినేది.. పరిష్కరించేది జగనన్న మాత్రమే అని ప్రజలు గుర్తుంచుకోవాలి.
source : sakshi.com
Discussion about this post