నిరుద్యోగ యువతకు శుభవార్త! ఇప్పటికే గ్రూప్– 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈమేరకు వివిధ కేటగిరీల్లో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది.
మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. వీటిలో 37 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్‌ఎస్‌ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్తు శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టు, ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
source : sakshi.com
Discussion about this post