దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఏకైక మార్గం చదువు అని రాప్తాడు ఎంఎల్‌ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అన్నారు. ‘‘విద్యార్థి దశలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు’’ అనే అంశంపై ప్రముఖ మోటివేషన్ స్పీకర్ వేణుకళ్యాణ్ ‘యూత్ లీడ్’’ కార్యక్రమాన్ని బుధవారం ఎస్‌కెయులో ఏర్పాటు చేశారు. ఎంఎల్‌ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారితో పాటు వైఎస్సార్‌సిపి హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బోయ శాంతమ్మ, ఎస్‌కెయు విసి హుసేన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఎల్‌ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మంచిమంచి స్థాయిల్లో మన విద్యార్థులుæ ఉండాలన్నదే జగనన్న లక్ష్యం. కష్టాన్ని ఓర్చుకునేవాడు, ఇబ్బందులకు తట్టుకునేవాడు ఖచ్చితంగా భవిష్యత్తులో లక్ష్యాన్ని చేరుకుంటాడు. మీ బంగారు భవిష్యత్తే మాకు చాలా ముఖ్యం.
సమాజానికి ఉపయోగపడే ప్రతి పనినీ నేను ఇష్టంతో చేశా. మనసు పెట్టి చేశా. ప్రజల కోసం రోజూ 18 గంటలు పని చేస్తున్నా. భవిష్యత్తులోనూ చేస్తా. నాకు ఏమీ మిగలకపోయినా ప్రజల ప్రేమ, అభిమానం లభిస్తేచాలు. భవిష్యత్తులో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులుగా, గొప్ప లీడర్లుగా విద్యార్థులు ఎదగాలి. అనంతపురం పేరులో మొదటి అక్షరంగా ‘ఎ’ ఉందని, అలాగే దేశంలోనే అనంతపురం జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టే స్థాయికి ఎదగాలి.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం ఇతర రాష్ట్రాలకు దిక్చూచిలా నిలిచింది. ఈ పథకం కింద ఉన్నత చదువులు చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లు, వైద్యులుగా ఎదిగారు. సమాజాన్ని అద్భుతమైన ప్రపంచంగా మార్చబోయేది విద్యే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిఎం అయిన తర్వాత సంపూర్ణ ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోంది. కుటుంబాల అభివృద్ధికి ఏకైక ఆయుధం చదువు. కుటుంబం అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్లోబల్ లీడర్లుగా ఎదగాలనే ఉద్దేశంతో డిజిటల్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

Discussion about this post