పుట్టపర్తి గ్రామీణం: ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం, అనంతరం ఉపాధి కల్పించడం జరుగుతుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ శివరంగప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలి పారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ ఏసీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో స్కిల్ హబ్ రెండు నెలలపాటు భూ సర్వే, ఎలక్ట్రి షియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం చూపడం జరుగుతుందని తెలియజేశారు. పది, ఇంటర్ ఆపైన చదివిన 16-35 ఏళ్ల వయసు వారు అర్హులని చెప్పారు. మరిన్ని వివరాలకు 91105 50779కి సంప్రదించాలని కోరారు.
Discussion about this post