ఎల్లోమీడియా అండతో టీడీపీ నేతలు విషం కక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. బుధవారం మండలంలోని వెలుగోను గ్రామంలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ నేత పాపకన్ను మధుసూదన్‌రెడ్డి పంగిలి గ్రామంలో 400 ఎకరాల ప్రభు త్వ భూమిని ఆక్రమించారంటూ ఏబీఎన్‌లో అసత్య కథనం ప్రసారం చేశారని మండిపడ్డా రు. దమ్ముంటే ఎవరైనా రుజువు చేయాలని సవాల్ విసిరారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర గల పాపకన్ను కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అనంతరం ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post