వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుకను అధిష్టానం ప్రకటించింది. గతంలో మాచాని వెంకటేష్‌ను సమన్వయకర్తగా ప్రకటించినా.. అధిష్టానం మాజీ ఎంపీ బుట్టారేణుక వైపు మొగ్గు చూపింది. కాగా.. 2014 నుంచి 2019 వరకు కర్నూలు పార్లమెంట్ సభ్యురాలుగా ఈమె పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుట్టా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. బుట్టా రేణుకను ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ నమన్వయకర్తగా పార్టీ అధిష్టానం నియమించటంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
source : sakshi.com
Discussion about this post