ఎపి డిఎస్‌సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. అలాగే టెట్ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ప్రకటించాలని సూచించారు. దీంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది. ముందుగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్ నిర్ణయించారు. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారా ? వాయిదా పడుతుందా ? అని అభ్యర్థుల్లో సందేహం నెలకొంది. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా శాఖ ప్రకటించింది. అలాగే టెట్ ఫలితాలను కూడా నిలిపివేసింది. నిజానికి మార్చి 14వ తేదీన ఈ ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు.
source : prajasakthi.com
Discussion about this post