గోరంట్ల (అనంతన్యూస్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారథిని కలసిన అభ్యర్థి సవితమ్మ, బుధవారం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తామని ఆమే తెలియజేసారు. అనంతరం సవితమ్మ మరియు పరిశీలకులు నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన బుధవారం ఉదయం 8 గంటలకు పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో ఎన్నికల శంఖారావాన్ని ప్రారభిస్తున్నామని తెలియచేసారు. ఈకార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Discussion about this post