ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్‌గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. మొత్తం 62 మంది పలు ఆకృతులను తయారు చేశారు. ఇందులో వేరుసెనగ విత్తన నమూనాను ఉత్తమమైందిగా ఎంపిక చేశారు. విజేత ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గూడురు ప్రశాంత్ కుమార్‌కు రూ.5 వేలు, ప్రశంసాపత్రాన్ని కలెక్టర్, జడ్పీ సీఈఓ నిదియాదేవి అందించారు. మిగతా 62 మందికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ ఆలోచన జడ్పీ సీఈఓదేనని వివరించారు.
source : eenadu.net
Discussion about this post