ఎన్నికల నియమావళి వస్తుందన్న తొందరలో సీఎం జగన్ చేతుల మీదుగా వరసిద్ధి వినాయక వైభవం, ఉపాసన విధానం, చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. ఛైర్మన్ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉభయదారులకు ఎల్లప్పుడు ఆలయ పాలకమండలి, అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు.సమస్య వస్తే కూర్చొని పరిష్కరించుకోవాలని, కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం మంచి పద్ధతి కాదన్నారు. ఆలయ ప్రతిష్ఠ దిగజార్చేలా కొందరు ఉభయదారులు ప్రవర్తించడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఆవిష్కరించిన గ్రంథంలో ఉభయదారులకు సముచితస్థానం కల్పించినట్లు తెలిపారు. ఇందులో ఏదైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. త్వరలో మూడు వేల గ్రంథాలను అందుబాటులోకి తెస్తామన్నారు.
source : eenadu.net










Discussion about this post