‘జన బలం ముందు..జెండాల బలం నిలబడ లేదు. రానున్న ఎన్నికల్లో ప్రజాభిమానంతో వైఎస్సార్ సీపీ అన్ని స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఆ తర్వాత టీడీపీ కనుమరుగు కావడం తథ్యం’ అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ అన్నారు. బుధవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలకడలేని రాజకీయాలు చేస్తూ జోకర్‌గా మారారన్నారు. వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన పవన్ కల్యాణ్, వలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పిన లోకేష్, చంద్రబాబు ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచడంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి సేవలందిస్తున్న వలంటీర్లపై చంద్రబాబు కుట్ర పన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. మరో రెండు నెలల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తారని, అప్పుడు 1వ తేదీ తెల్లవారుజామునే వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తారన్నారు. చంద్రబాబు నిజం చెబితే ఆయన తల పగులుతుందనే శాపం ఉందని వైఎస్సార్ చెప్పేవారని, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో చూస్తే ఆదే గుర్తుకు వస్తోందన్నారు. అధికారం కోసం గతంలోనూ 600 హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని, ఇప్పుడు మళ్లీ ‘సూపర్ సిక్స్’ అంటూ జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ విజ్ఞులైన ప్రజలు ఏకంగా టీడీపీనే రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
source : sakshi.com
Discussion about this post