మధ్యం దుకాణాలపై నిఘా ఏదీ.?- మద్యం దుకాణాల వద్ద వాచ్ మెన్ లు కానరారు..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ నడుచుకోవాల్సి ఉంది. కానీ కొన్ని ప్రభుత్వ శాఖలు తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమందేపల్లి ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తులు హల్చల్ 11 గంటలైనా షాపు లోపల ఉండి వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మద్యం సరఫరా చేస్తున్నారని, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మందుబాబులు కోరుకుంటున్నారు. మద్యం దుకాణంలో మంచి క్వాలిటీ మద్యం కస్టమర్లకు ఇవ్వకుండా ముందే స్కాన్ చేసి మద్యం షాపులలో పనిచేస్తున్న వ్యక్తులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం, రాత్రిపూట సెక్యూరిటీగా ఉండవలసిన వ్యక్తులు మద్యం దుకాణం వద్ద ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి.సెక్యూరిటీ నైట్ టైం లో లేకపోవడం తో అయోమయ పరిస్థితి, మద్యం దుకాణం ధరల పట్టిక బోర్డు మద్యం దుకాణం బయట ఉండాలి మద్యం దుకాణం లోపల పెట్టడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది, అదే కాకుండా దేవాలయాలు,విగ్రహాలు,ఉన్న ప్రాంతాలలో మద్యం షాపులు ఉండడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలు ఊరు బయట పెట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిగా పెట్టాలని ఆ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Discussion about this post