హిందూపురం పార్లమెంట్ సీటును పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని, లేకపోతే తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు చూపుతామని ఆ పార్టీ నాయకులు అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పలువురు బీజేపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన ఆరు ఎంపీ స్థానాల్లో హిందూపురం పార్లమెంట్ కూడా ఉందన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు ధర్మానికి తూట్లు పొడిచారన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా పక్కనపెట్టి హిందూపురం ఎంపీ సీటును టీడీపీకి కేటాయించుకున్నారన్నారు. ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. హిందూపురం సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని, లేకుంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
source : sakshi.com
Discussion about this post