అరకు ఎంపీ మాధవి శివప్రపాద్ దంపతుల కుమార్తెకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నామకరణం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన మాధవి, భర్త శివప్రసాద్ అక్కడకు వచ్చిన సీఎం జగన్‌ను కలిశారు. వారి కోరిక మేరకు చిన్నారికి నామకరణం చేశారు. తాము కోరిన వెంటనే సీఎం నామకరణం చేయడం ఆనందంగా ఉందని, త్వరలో బారసాల నిర్వహించి సీఎం నామకరణం చేసిన పేరును ప్రకటిస్తామని ఎంపీ మాధవి చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు.
source : sakshi.com
Discussion about this post