ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ రౌడీ రాజ్యం నడుస్తోందని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రాలో ఊరూరా జగన్ గుండారాజ్ కొలువుదీరింది.. ఇక్కడ వ్యవస్థలు ఏమీ లేవుని చంద్రబాబు విరుచుకుపడ్డారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలిచిందని వివరించారు. క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు
source : andhrajyothi.com
Discussion about this post