టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 27న ఉరవకొండలో ‘రా.. కదలిరా’ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా బుధవారం ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, ఇతర ముఖ్య నాయకులు.
చరిత్రలో నిలిచిపోవాలి: కేశవ్
ఉరవకొండలో ‘రా.. కదలిరా’ బహిరంగ సభను చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా నిర్వహిస్తాం. జిల్లాలోని పార్టీ నేతలు, శ్రేణులు సమష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ముందుకు సాగుతున్నాం. చంద్రబాబు సభకు పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలి.
source : https://www.andhrajyothy.com/2024/andhra-pradesh/ananthapuram/come-to-uravakonda-dont-move-1200860.html
Discussion about this post