వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ప్రజల శ్రేయస్సు కోసం తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో నందమూరి బాలకృష్ణ ఈనెల 13, 14 తేదీలలో సైకిల్ ర్యాలీ చేపట్టనున్నారు. ప్రచారంలో భాగంగా ఈనెల 13న ఉదయం కదిరిలో లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కదిరిలో దర్గాను సందర్శిస్తారు. అనంతరం జీవీఎంఏఎన్‌యూ కూడలిలో సమావేశం, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు కూడలిలో సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి శింగనమలకు చేరుకుని బస చేస్తారు. 14న ఉదయం శింగనమల నియోజకవర్గం కల్లూరులో నీలం సంజీవరెడ్డి విగ్రహం కూడలిలో సమావేశం, అనంతరం అనంతపురం అర్బన్‌లో కేఎస్‌ఆర్ ప్రభుత్వ కళాశాల కూడలిలో సమావేశాలకు హాజరవుతారు. అదే రోజు రాత్రి తాడిపత్రి చేరుకుని బస చేస్తారు. అభిమానులు, తెదేపా, భాజపా, జనసేన, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైన జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు.
source : eenadu.net
Discussion about this post