ఈనెల 12న ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలువిడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4తో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. అనంతరం పునఃపరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక.. ఏపీ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈనెల 8వ తేదీతో ముగియనుంది. అనంతరం వారం, పది రోజుల్లో ఏపీ 10వ తరగతి ఫలితాలు సైతం విడుదలయ్యే అవకాశం ఉంది.
Discussion about this post