హిందూపురంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జడ్పీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ఆధ్వర్యంలో గురువారం పట్టణానికి చెందిన పేదలు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాలుగా నిరుపేదలు స్థలాలు లేక అద్దెఇళ్లల్లో ఉంటున్నారన్నారు. వారిని గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేనిపక్షంలో తామే ఆక్రమించుకొంటామన్నారు. అనంతరం వారు తహసీల్దార్ స్వర్ణలతకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రమణ, పార్టీ నాయకులు పి.ప్రవీణ్ కుమార్ బాబావలి, జ్యోతమ్మ, నారాయణ, రాముడు, గోవిందప్ప, భాస్కర్ పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post