పురపాలక సంఘం వ్యాప్తంగా వికలాంగులు, వృద్దులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం నాడు తహశీల్దార్ శివప్రసాద్‌రెడ్డితో కలిసి బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేకంగా 85సంవత్సరాలు నిండిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. ఇందుకోసం ఫారం 12డితో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే బిఎల్‌ఒలు వారి పరిధిలో ఉన్న వారిని గుర్తించి ఈ విషయాన్ని వారికి వివరించాలన్నారు. ధరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలన చేసి, ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో పిఒ, ఎపిఒ, బిఎల్‌ఒలు భధ్రత నడుమ వారికి ఇంటికి వెళ్లి ఓటు వేయించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఇంకా ఎవరైన ఉంటే ఫారం-6తో ధరఖాస్తు చేసకుని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ రెండు అంశాలపై బిఎల్‌ఒలు అప్రమత్తంగా పని చేయాలన్నారు.
source : prajasakthi.com
Discussion about this post