రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడత మెగా చెక్కు పంపిణీ కోసం సోమవారం ఉదయం మంత్రి ఉష శ్రీచరణ్ స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. సభ ఆలస్యంగా ప్రారంభమవడంతో విసిగిపోయిన మహిళలు దాహంతో గొంతెండిపోతోందని మంత్రి ప్రసంగం ప్రారంభంకాక ముందే వెనుదిరిగి వెళ్లిపోయారు. సమావేశంలో కుర్చీలు వేశారు కాని తాగేందుకు నీళ్లు ఇవ్వకపోవడంపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇళ్లకు వెళ్లిపోవడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకొన్న నాయకులు వెంటనే నీళ్ల పొట్లాలు అందజేశారు. మధ్యాహ్నం భోజనవసతి కల్పించారు. కార్యక్రమంలో పెనుకొండ మండలంలోని 900 సంఘాల్లోని 8337మంది మహిళలకు నాలుగోవిడత ఆసరా రూ.6.28కోట్లు మెగా చెక్కును మంత్రి అందజేశారు.
source : eenadu.net
Discussion about this post