చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. బెంగుళూరు వైపు నుండి అనంతపురం మీదుగా తాడిపత్రి కి వెల్లే ఆర్టీసి బస్సు 44 వ జాతీయ రహదారి కోడూరు తోపు కనిశెట్టిపల్లి క్రాస్ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వీ.లక్ష్మిదేవి,అజయ్, కళావతి , లక్ష్మినారాయణమ్మలకు, డ్రైవర్ మోహన్ కి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్ లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఎటువంటి ప్రాణపాయం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
source : prajasakthi.com
Discussion about this post