అపరిష్కృత డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు సుదీర్ఘంగా సమ్మె చేసినా ప్రభుత్వం కనికరం చూపలేదు. సరికదా.. ఎస్మా చట్టం ప్రయోగంతో బెదిరించింది. ఉద్యోగాలు తొలగిస్తామంటూ భయపెట్టారు. తప్పని పరిస్థితిలో విధుల్లో చేరినా ఏ సమస్యా తీర్చలేదు. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 5,126 కేంద్రాల్లో దాదాపు పదివేల మంది అంగన్‌వాడీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరూ మహిళలే. వేతనం పెంపు, గ్రాట్యుటీ వర్తింపు, మినీ కేంద్రాన్ని ప్రధాన కేంద్రంగా గుర్తింపు.. వంటి సమస్యల ఊసేలేదు. సమ్మె కాలానికి వేతనం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చని దుస్థితి. గతేడాది డిసెంబరు 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 దాకా సమ్మె చేపట్టారు. ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు.. కానీ ఏఒక్క ప్రయోజనం చేకూరలేదు.
source : eenadu.net
Discussion about this post