కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్ టుడే: పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో ‘ఆడుదాం ఆంధ్రా’లో భాగంగా నియోజక వర్గంగా గురువారం సాయంత్రం కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం జట్ల కళాశాలలో పోటీ పడింది. ఈ జట్లలో స్థానికేతరులు ఉన్నారంటూ ఇతర క్రీడాకారులు మాట్లాడడంతో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మైదానం వదలి రోడ్డుపైకి వెళ్లారు. పట్టణ సీఐ హరినాథ్ సిబ్బందితో అక్కడికి చేరుకోగా అందరూ వెళ్లిపోయారు. కబడ్డీ పోటీని 27వ తేదీకి వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post