ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలో వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం అనంతపురం నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో డీఆర్‌డీఏ– వైఎస్సార్ క్రాంతి పథం శకటానికి ప్రథమ బహుమతి దక్కింది.
ద్వితీయ బహుమతి విద్యాశాఖ శకటానికి, తృతీయ బహుమతి వైద్యారోగ్యశాఖ శకటాలు సాధించాయి. అగ్నిమాపకశాఖ ప్రత్యేకంగా నిర్వహించిన త్రివర్ణ ప్రదర్శన ఆకట్టుకుంది.
source : sakshi.com
Discussion about this post