పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని వంకర కుంట లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి గారు వంకరకుంట చౌడేశ్వరి దేవాలయంలో పూజలందుకొన్న అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పేద వారి సంక్షేమానికి పెద్ద పీట వేసిన జగనన్న ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Discussion about this post