రాష్ట్రంలోని ఆర్.జె.డి.లు, డి.ఇ.ఓ.లు., ఎం.ఇ.ఓ.లు మరియు ఆం.ప్ర.గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులు అందరికీ తెలియజేయునదేమనగా:
- 2024-25 విద్యా సంవత్సరమునకు ఆం.ప్ర.గురుకుల 38 సాధారణ పాఠశాలలలో (i) 5వ తరగతిలో (ii) 6, 7 & 8 తరగతులలో మిగిలివున్న ఖాళీలకు ప్రవేశమునకై APRS CAT-2024 మరియు (iii) 7 జూనియర్ కళాశాలలు (iv) 1-డిగ్రీ కళాశాల(బాలురు), నాగార్జున సాగర్ లో మొదటి సంవత్సరంలో ప్రవేశములకై APRJC & DC CET-2024 నోటిఫికేషన్ విడుదల చేయడమైనది.
- APRS CAT-2024 మరియు APRJC & DC CET-2024 ప్రవేశ పరీక్షకు హాజరగుటకు ఆసక్తి గల విద్యార్ధులు https://aprs.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు తేదీ 01/03/2024 నుండి 31/03/2024 వరకు సమర్పించవలెను. అన్నివివరములు పై వెబ్ సైట్ ద్వారా పొందవచ్చును. APRS CAT-2024 తేదీ.25/04/2024 న ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు మరియు APRJC & DC CET-2024 తేదీ.25/04/2024 న మధ్యాహ్నం 2.30 నుండి 5.00 గంటల వరకు 26 జిల్లాలోని కేంద్రాలలో నిర్వహించబడును.
- పై ప్రవేశ పరీక్షల విషయమై ప్రింట్ & ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేయవలసినదిగా కోరడమైనది.
- రాష్ట్రంలోని 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (i) 5వ తరగతి (ii) 6,7 & 8 తరగతులలో (మిగిలివున్న ఖాళీలలో), (iii) 3 జూనియర్ కళాశాలల్లో మైనారిటీ కోటా సీట్ల ప్రవేశమునకు మైనారిటీ విద్యార్ధులు పరీక్ష వ్రాయనవసరం లేదు. తేదీ 01/05/2024 నుండి సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించి, దరఖాస్తు చేసుకొని నేరుగా అడ్మిషన్ ను పొందవచ్చును.
- పై గురుకుల విద్యాలయములలో కల్పించబడుచున్న విద్యావకాశములు మరియు సదుపాయాలు సద్వినియోగం చేసుకొనుటకు తల్లి దండ్రులకు, విద్యార్ధులకు తగిన రీతిలో అవగాహన కల్పించి పై ప్రవేశ పరీక్షలకు అధిక సంఖ్యలో విద్యార్ధులు దరఖాస్తు చేసికొనుటకు విస్తృత ప్రచారం చేయవలసినదిగా కోరడమైనది.
ధన్యవాదములతో,
ఆర్ నరసింహారావు
అడిషనల్ డైరెక్టర్ &
కార్యదర్శి ఆం. ప్ర. గు. వి.సంస్థ.
Discussion about this post