హిందూపురం: అర్హత కలిగిన వారందరికీ ఉచిత న్యాయసహాయం అందజేయడం జరుగుతుందని అదరపు జిల్లా జడ్జి కంపల్లె శైలజతెలిపారు. శనివారం స్థానిక అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో జరిగినన్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చాలామంది ఆర్థిక ఇబ్బందులకారణంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేకపోతుంటారని అలాంటివారికి ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడంజరుగుతుందన్నారు. న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులు దరఖాస్తుచేసుకుంటే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయవాదులను ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారుసద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కాగా కొట్టూరు నిర్మలవృద్ధాశ్రమంలో జరిగిన సదస్సులో న్యాయవాదులు మాట్లాడుతూ వృద్ధులపట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులనుచూసుకోవాల్సిన బాధ్యత కుమార్తెలపై కూడా ఉంటుందని తెలిపారు.ఆశ్రయం లేని వృద్దులు భరణం కోసం న్యాయస్థానాల వద్ద దరఖాస్తుచేసుకోవచ్చన్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇందులోభాగంగా జరిగిన లోక్ అదాలత్ లో పలు కేసులను పరిష్కరించి అర్జీదారులనుండి వినతులు స్వీకరించారు.ఆయా కార్యక్రమాల్లో న్యాయవాదులుసుదర్శన్, పీవీ శ్రీనివాస్ రెడ్డి, వన్నెరప్ప, పార్వతి, నవేరా, రామి రెడ్డి, భరత్,రవిచంద్ర, గురునాథ్, గోపాల్, ఎస్సై హారూన్ భాష, లైజనింగ్ అధికారిథీనివాసులు, లోక్ అదాలత్ సిబ్బంది శారద తదితరులు పాల్గొన్నారు.
source: anantha bhoomi
Discussion about this post