అనంత జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ అయిన గుంతకల్లులో తాగు, మురుగు నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో అమృత్ పథకాన్ని మంజూరు చేసింది. అందుకు రూ.35.01 కోట్లు కేటాయించింది. వాటితో తాగునీటి పైప్ లైన్ల నిర్మాణం, నీటిని శుద్ధి చేసే ప్లాంటు, ఉపరితల ట్యాంకులు, పంపింగ్ గదుల నిర్మాణాలు, పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకవైపు టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగగా.. మరోవైపు పనులను ప్రారంభించిన తర్వాత పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ముఖ్యమైన పనులు పునాదులకే పరిమితం అయ్యాయి. నిధులను 2023 సంవత్సరం మార్చి ఆఖరుకల్లా వినియోగించాల్సి ఉంది. గడువులోపు అధికారులు నిధులు వినియోగించలేదు. దాంతో నిర్మాణాలు కంపచెట్లలో ఉండిపోయాయి.
త్వరగా పూర్తి చేస్తాం
- మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్
పనులు త్వరగా పూర్తిచేయాలని గుత్తేదారులకు నోటీసులు అందజేస్తున్నాం. మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణ పనులకు గతంలో పనులు పొందిన గుత్తేదారులను తొలగించి మళ్లీ టెండర్లు నిర్వహించాం. గుత్తేదారుతో మాట్లాడి పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తాం.
Discussion about this post