దశాబ్దాలుగా వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంతమ్మతో కలసి అనంతపురం రూరల్ మండలం తాటిచెర్లలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, వైఎస్సార్‌సీపీ నాయకులు వైటీ శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.30 లక్షల నిధులతో తాటిచెర్ల రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. తాటిచెర్ల చెరువుకు నీళ్లు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు రూ.65 లక్షల దాకా ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే ఈ మొత్తాన్ని గ్రామపెద్దల చేతుల్లో పెట్టి ఎన్నికలకు వెళతామని ప్రకటించారు.
పదేళ్ల పాటు ఈ ప్రాంతానికి పరిటాల సునీత ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసినా ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా 17 వేల ఇళ్లను మంజూరు చేయించామన్నారు. 2 వేలమంది పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించామన్నారు. 4 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు గార్మెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 11.50 ఎకరాల భూములు కేటాయించామన్నారు. ఆరు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయన్నారు. నియోజకవర్గంలోని పాడి మహిళా రైతులకు అండగా నిలుస్తూ రూ.20 కోట్ల సొంత నిధులతో అమ్మ డెయిరీ ఏర్పాటు చేశామన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేయించడంతో పాటు రామగిరిలోని బంగారు గనులను తెరిపిస్తున్నామన్నారు. రూ.1,500 కోట్లతో 300 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చామన్నారు. నియోజకవర్గంలో రూ.5 వేల కోట్లతో 1,050 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. అనంతపురం రూరల్ మండలంలో 7 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మంత్రిగా పని చేసిన పరిటాల సునీత తాటిచెర్ల గ్రామానికి కనీసం 14 ఇళ్లు తీసుకురాలేదన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు.
చంద్రబాబు వస్తే కరువు వస్తుందనేది చాలామార్లు రుజువైందన్నారు. అలాంటి బాబును నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ధనుంజయయాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్లు మఠం శ్యాంసుందర్, జయచంద్రారెడ్డి, యూత్ మండల కన్వీనర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి శీనా, ఎంపీటీసీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post