మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుణేమోరుబాగుల్, మోరుబాగుల్ తాళికేర, ముతుకూరు, సీసీగిరి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎం.ఎస్.రాజు, గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఇంతవరకు అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే, జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీతోనే అంటూ వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతుల కష్టాలు తీరాలన్నా, భావితరాలకు భవిష్యత్తు రావాలన్నా, మహిళలకు అండగా ఉండే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మాకు రెండు ఓట్లూసైకిల్ గర్తుకు వేసి, వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఓట్ల అభ్యర్థించారు.
source : eenadu.net
Discussion about this post