చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్ ప్రసంగించారు.
మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.
దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ ద్వారా బటన్‌లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు.
మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుతం మీ బిడ్డ ప్రభుత్వమే.
మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ కానుక. ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?
మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.
చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.
source : sakshi.com
Discussion about this post