అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనన్నారు. నెల్లూరులో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని ఆరోపించిన ఆయన.. ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని, ఆయన కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితికి తెచ్చారని అన్నారు.
జగన్ పతనం ప్రారంభమైందని, దానిని దేవుడు కూడా కాపాడలేడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బాధితుడు ఓ స్టార్ క్యాంపెయినరేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 5 కోట్ల మంది ప్రజలు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని పిలుపునిచ్చారు. వైకాపాను భూస్థాపితం చేస్తామని ప్రజలు శపథం చేయాలన్నారు. వైకాపాలో పేదలకు సేవ చేస్తే పదవులివ్వరని చెప్పిన ఆయన.. బూతుల రత్నకు ఎమ్మెల్యే. బూతుల సామ్రాట్‌కు ఎంపీ, బూతుల నటసామ్రాట్‌కు మంత్రి పదవులిస్తారని ఎద్దేవా చేశారు.
source : eenadu.net
Discussion about this post