రూ.10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం
దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే
రాబడి పెంచుకునేందుకు పదేపదే పన్నులు మోపిన జగన్
ఐదేళ్లలో రూ.1.08 లక్షల కోట్లు చెల్లించిన పౌరులు
ఐదేళ్ల కిందట… ఒక్క అవకాశం ఇవ్వండన్నారు ఇస్తే… అందరినెత్తినా లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టారు! ఇప్పుడు ఆంధ్రావనిలో ప్రతి ఒక్కరిపై ఉన్న తలసరి అప్పు రూ.2,04,365..!! ఇవన్నీ పన్నుల రూపంలో చెల్లించేది ప్రజలే! ఆ విషయం చెప్పకుండా… నా పాలన భేష్ అంటున్నారు.. రాష్ట్రంలో గణనీయమైన మార్పొచ్చిందంటున్నారు… అది మార్పు కాదని… కాగ్ తూర్పార పడుతోంది రాష్ట్ర ఆర్థికరంగానికి జగన్ చేసిన గాయమంటోంది కేంద్రమూ పారాహుషార్ అని హెచ్చరిస్తోంది. అయినా… ఆయన అప్పులు ఆపట్లేదు పైగా… మళ్లీ సిద్ధం అంటున్నారు!
గన్ హయాంలో రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం జనవరి ప్రారంభానికే రూ.10.21 లక్షల కోట్లను దాటింది. అసలు ప్రభుత్వ అప్పుతో మనకేంటి సంబంధం? దాన్ని ప్రభుత్వమే తీర్చుకుంటుంది కదా…! అని సామాన్య ప్రజలు చాలామంది అనుకుంటారు. కానే కాదు!! ఆ అప్పులన్నీ తీర్చేది ప్రజలే. ప్రభుత్వం తనకొచ్చే రాబడి నుంచే ఈ రుణాలను తీరుస్తుంది. ఆదాయంలోనూ 70% ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వ అప్పులు పెరిగే కొద్దీ పౌరులపై పన్నుల భారం అదేస్థాయిలో పెరిగిపోతుంది. ఈక్రమంలోనే జగన్ సర్కారు జనం జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేసుకుంది. వారిపై ఇతర రాష్ట్రాల్లో కనిపించని ఎన్నో భారాలు మోపి, బాదుడే బాదుడు కొనసాగించింది.
source : eenadu.net
Discussion about this post