ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను వైఎస్ సునీత సోమవారం కడపలో కలిసారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో ఇరువురు సోదరిమణులు సుమారు మూడుగంటలపాటు తాజా రాజకీయాలపై సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వారిద్దరూ నివాళులర్పించారు. అన్న జగన్మోహన్ రెడ్డిపై ధిక్కార స్వరం వినిపిస్తున్న వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించాలని షర్మిల భావిస్తున్నట్లుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈరోజు కడప, ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‌లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..మరోవైపు సోమవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సునీత కూడా హాజరవుతున్నట్లు సమాచారం.
source : Andhrajyothi.com
Discussion about this post