వచ్చే ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెదేపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లాలోని ఆరు నియోజకవర్గ సమన్వయకర్తలు సమావేశమయ్యారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ధర్మవరం సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో చేపట్టబోయే అంశాల గురించి చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వైకాపా నుంచి పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పించడం వంటి అంశాల గురించి చర్చించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ నెల 19న నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. ఈ నెల 22న జిల్లా స్థాయి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
source : eenadud.net
Discussion about this post