‘‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు వర్తింపజేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారు. అందుకే మేం ఈ ఎన్నికల్లో ధైర్యంగా ఓటు అడుగుతున్నాం.. ప్రజాభిమానంతో జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలిచి తీరుతాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ అన్నారు. గురువారం ఆయన పార్టీ నేత వేణురెడ్డితో కలిసి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాము మంచి చేశాం కాబట్టి దాన్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నామని, టీడీపీ హయాంలో ఏం చేయలేకపోయారు కాబట్టే ఆ పార్టీ నేతలు వారు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పుకోలేక..తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. హిందూపురంలో బీసీ మహిళ దీపికకు జగనన్న అవకాశం ఇచ్చారని, తప్పకుండా భారీ మెజార్టీతో పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 24న తమ పార్టీ హిందూపురం అభ్యర్థి టీఎన్ దీపిక నామినేషన్ వేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రాజారెడ్డి, ఎంపీటీసీ జగన్‌మోహన్‌రెడ్డి, అన్సర్ అహ్మద్, రాఘవేంద్రరెడ్డి, సుందరరాజు, గోవిందరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, బాబే నాయక్, అంజన్‌రెడ్డి, శంకరప్ప, నయీముల్లా పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post