న్యాయసాధన సభ పేరుతో కాంగ్రెస్‌పార్టీ సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వామపక్షపార్టీలు కాంగ్రెస్‌కు మద్దతుగా సభలో పాల్గొన్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరైన సభలో షర్మిల ప్రసంగిస్తూ పుట్టింటి హక్కుల కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు. నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డను, ఆయన రక్తం నాలో ప్రవహిస్తోంది. ఆయన ఆశయాలు సాధించడానికి కాంగ్రెస్‌పార్టీలో చేరానన్నారు. ఏఐసీసీ సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ పిడికెడు మెతుకుల కోసం ఆనాడు జిల్లా నుంచి లక్షల మంది వలస వెళ్తుంటే సోనియాగాంధీ వలసల నియంత్రణకు మహాత్మాగాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధిహామీ పథకానికి చట్టం చేసిందన్నారు. నేడు పేదల కోసం ఇందిరమ్మ గ్యారంటీ పథకం కింద నెలకు రూ.5 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకంటించామన్నారు. అనంతపురం వేదికగా ప్రకటించిన ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ సాధించలేని దద్దమ్మ అని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశభవిష్యత్తు అగమ్యగోరంగా ఉందన్నారు. తెలుగుప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి భాజపా తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. భాజపాను ఇంటికి పంపాలని, వైకాపాకి మరణశాసనం రాయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మైనార్టీ సెల్ దాదాగాంధీ, ఎస్సీ సెల్ శంకర్, సీపీఐ జగదీశ్, జాఫర్, నారాయణస్వామి, సీపీఎం రాంభూపాల్, వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
Discussion about this post