మండలంలోని గోవిందవాడలో శుక్రవారం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లేకుండానే వైకాపా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఆ పార్టీ నాయకులు లబ్ధిదారులకు జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెట్టు, నాయకులు రోడ్‌షో నిర్వహించారు. లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపకుండా పట్టాలు ఇవ్వడం గమనార్హం. ర్యాలీలో విద్యార్థుల, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తాము నివేశస్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి స్థానిక నాయకులకు అందజేశామని, పంపిణీ తమకు సంబంధం లేదన్నారు.
source : eenadu.net
Discussion about this post